పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. CBSE, ICSE, ఐబీ సహా ఇతర బోర్డు స్కూళ్లల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి.. 2026-27 నుంచి పదో తరగతికి అమలు చేయాలని ఆదేశించింది. CBSE పాఠశాలల్లో సులువైన బోధనకు సులభతర వాచకం వెన్నెలను ఉపయోగించాలని ఉత్తర్వుల్లో తెలియజేసింది. తెలుగుపై ఆసక్తి చూపేవారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకునే వారికి సులభతర(Simple) తెలుగు వాచకం సహకారి కానుంది.