ఉష్ణోగ్రతలు(Temparatures) పెరిగే అవకాశమున్నందున జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో రాబోయే మూడు రోజులు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడింది. కానీ మళ్లీ ఎండలు జోరందుకున్నాయి. నిన్న(మార్చి 27న) నిజామాబాద్ లో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.1, ఆదిలాబాద్ 39.8, భద్రాచలంలో 39 డిగ్రీల చొప్పున రికార్డయింది.