ఇంటర్మీడియట్(Intermediate) ఫలితాలు విడుదలైన దృష్ట్యా ఇక పదో తరగతి(Tenth Class) రిజల్ట్స్ పై విద్యాశాఖ దృష్టిపెట్టింది. ఫలితాల్ని విడుదల చేసే తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల 30న పదో తరగతి ఫలితాల్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి(Secretary) బుర్రా వెంకటేశం రిజల్ట్స్ ప్రకటిస్తారు.
వీటి కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే రిజల్ట్స్ వస్తాయని భావించినా డేట్ ప్రకటించకపోవడంతో పరీక్షలు రాసినవారంతా ఎదురుచూపులకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఇంటర్ ఫలితాలు ప్రకటించిన సందర్భంగా టెన్త్ రిజల్ట్స్ డేట్ కూడా అనౌన్స్(Announce) చేయడంతో ఇక నిరీక్షణకు తెరపడనుంది.