పదోతరగతి పూర్తి కాగానే నేరుగా ఇంటర్మీడియట్లోకి ప్రవేశించే మోడల్ స్కూళ్ల విధానాన్ని BC గురుకులాలకు వర్తింపజేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ అడ్మిషన్లకు ప్రత్యేక పరీక్ష నిర్వహించగా, ఇకనుంచి 10 పాసైతే చాలు నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. అన్ని గురుకులాల్లో ఎంసెట్, నీట్ కోచింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని BC సంక్షేమ శాఖ సమీక్ష(Review)లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ల ప్రమోషన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేరుగా ఇంటర్ కు వెళ్లేలా కార్యాచరణ(Action Plan) తయారు చేయాలన్నారు.
NSS, NCC, స్కౌట్స్ అండ్ గైడ్స్ తోపాటు ఈ నెల 15 నుంచి 31వ తేదీలోపు పేరెంట్స్ టీచర్ల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్లో కంప్యూటర్ తోపాటు అన్ని కోర్సులు ఉండాలని, గురుకులాల సమస్యలు తీర్చేలా స్థానిక MP, MLC, MLAతోపాటు జిల్లా మంత్రికి సంబంధించిన నిధులు కేటాయించేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను మంత్రి ఆదేశించారు.