
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET ) ఈరోజు జరగనుంది. మరికొద్దిసేపట్లో జరిగే పేపర్-1కు 2,69,557 మంది, మధ్యాహ్నం నిర్వహించే పేపర్-2కు 2,08,498 మంది అప్లయ్ చేసుకున్నారు. పేపర్-1కు 1,139, పేపర్-2కు 913 ఎగ్జామ్స్ సెంటర్స్ అందుబాటులో ఉంచారు. టెట్ లో వచ్చిన మార్కులకు టీచర్ రిక్రూట్మెంట్(Teacher Recruitment)లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున మార్కులు కీలకం కాబట్టి కొత్తగా రాసేవారితోపాటు ఇంతకుముందు క్వాలిఫై అయి మళ్లీ మార్కులు పెంచుకునేందుకు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఒకరోజు ముందుగానే తమకు కేటాయించిన సెంటర్లను పరిశీలించుకోవాలని అధికారులు చెప్పడంతో.. చాలా మంది అభ్యర్థులు వాటిని పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా బయటకు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఈరోజు కూడా భారీ వర్షాలు ఉండటంతో ఎగ్జామ్ సెంటర్స్ కు వెళ్లడం కష్టతరంగా మారింది.
బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులతోపాటు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. హాల్ టికెట్ పై వివరాలు(Details) తప్పుగా ఉంటే ఎగ్జామ్ సెంటర్ లో ఇచ్చే నామినల్ రోల్స్ లో సరిచేసుకోవాల్సి(Correct) ఉంటుంది.