ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాల్ని(Results) విడుదల చేశారు. పేపర్-1లో 67.13%తో 57,725 మంది.. పేపర్-2లో 34.18%తో 51,443 మంది అర్హత సాధించారు. 2023తో పోలిస్తే ఈసారి పేపర్-1లో 30.24%.. పేపర్-2లో 18.88% మేర ఉత్తీర్ణత పెరిగింది. http://schooledu.telangana.gov.in లో ఫలితాలు చూసుకోవచ్చు.
ఉపశమనం…
దరఖాస్తుదారుల(Applicants)కు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్-2024లో అర్హత సాధించని అభ్యర్థులు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. మరోవైపు టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి(One Time) ఫ్రీగా DSCకి దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చింది. టెట్ దరఖాస్తుల సమయంలో ఎలక్షన్ కోడ్ కారణంగా ఫీజు తగ్గింపు చేయలేకపోవడంతో సర్కారు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
తొలిసారిగా…
ఫస్ట్ టైమ్ ఆన్ లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలు గత నెల 20 నుంచి ఈ నెల 2 వరకు నిర్వహించారు. పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారు. DSC ద్వారా 11,062 పోస్టుల్ని భర్తీ చేయనుండగా… ఈ టెట్ రిజల్ట్స్ ను దృష్టిలో ఉంచుకుని దాని గడువును మరో వారం పాటు ఈ నెల 20 వరకు పొడిగించారు. DSCకి ఇప్పటివరకు 2.35 లక్షల మంది అప్లై చేసుకోగా.. తాజా టెట్ రిజల్ట్స్ వల్ల ఆ సంఖ్య మరింత ఎక్కువగా పెరగనుంది. ఈ ఎగ్జామ్స్ జులై 17 నుంచి 31 వరకు జరుగుతాయి.