
ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరపడింది. యాజమాన్యాలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరిపారు. రూ.1,500 కోట్లు అడిగారని అయితే ఇప్పటికే రూ.600 కోట్లు ఇచ్చామన్నారు. మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేసి, మిగతా రూ.300 కోట్లను కొద్దిరోజుల్లో అందిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయెంబర్స్మెంట్ పై కమిటీ వేస్తామని, అందులో అధికారులు, మేనేజ్మెంట్ల ప్రతినిధులకు అవకాశమిస్తామన్నారు.
విద్యాశాఖ కానీ CM కార్యాలయ అధికారులపై తామెలాంటి కామెంట్స్ చేయలేదని, మా మాటల్ని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయన్నారు. కాలేజీలు ఎలా బంద్ చేస్తారో చూస్తానంటూ CM రేవంత్ హెచ్చరించిన కొద్దిసేపటికే నిధులు విడుదల కావడం విశేషంగా మారింది.