
టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ హస్తంపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆయన తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్, ప్రభుత్వ తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వర్ రావు వాదనలు వినిపించారు. ఇద్దరి మధ్య వాడీవేడిగా వాదనలు జరగ్గా.. వాటిని పరిశీలించిన కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. 2023లో కమలాపూర్ పోలీసులు పెట్టిన కేసులో IPC 120b, 420, 447, 505(1)bతోపాటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ పరీక్షల నిరోధక చట్టం-1997లోని సెక్షన్ 4A 6 R/w8, IT చట్టంలోని సెక్షన్ 66D కింద FIR నమోదైంది.