గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద TGPSC కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజులుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలన్న ఆలోచన చేస్తోంది. కోర్టు ఆదేశించినట్లు పునర్ మూల్యాంకనం(Re-Valuation) చేయాల్సి వస్తే టెక్నికల్ సమస్యలు వస్తాయన్న భావనతో ఉంది. ఇవాళ నిర్వహించిన భేటీలో ఈ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. తమ తరఫున ఎలాంటి తప్పులేదని భావిస్తున్న కమిషన్.. అప్పీలుకు వెళ్లాలన్న దానిపై అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. రీవాల్యుయేషన్ లేదా మెయిన్స్ మళ్లీ నిర్వహించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.