గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) పలు సూచనలు చేసింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగే పరీక్షల్ని హైదరాబాద్(HMDA) పరిధిలోనే నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది. డిస్క్రిప్టివ్ పద్ధతిలో జరిగే ఈ ఎగ్జామ్స్ ముందుగా ప్రకటించినట్లు కాకుండా మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపింది.
పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని ఈ జూన్ 12న TGPSC ప్రకటించింది. ఇప్పుడా సమయాల్లో స్వల్ప మార్పులు చేయగా.. మొత్తం ఏడు పేపర్లకు సంబంధించి శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్లను ఈ నెల 17 నుంచి కమిషన్ వెబ్సైట్లో(Website) అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. హాల్ టికెట్లపై ముద్రించిన సూచనల్ని పరిగణలోకి తీసుకుని పరీక్షలకు హాజరు కావాలని స్పష్టం చేసింది.