RTC సిబ్బంది మరోసారి సమ్మెకు దిగాలని నిర్ణయించి యాజమాన్యానికి నోటీసులు అందించారు. 21 డిమాండ్లను కార్మిక సంఘాలు సర్కారు ముందుంచడంతో ఇక నాలుగేళ్ల తర్వాత RTCలో సమ్మె సైరన్ మోగింది. ఉద్యోగుల విలీనం, రెండు PRC అంశాలు ప్రధానమైనవిగా నిలిచాయి.
డిమాండ్లు ఇవే…
* 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు
* 2017 PRC బకాయిల్ని చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు
* అప్పులను సర్కారు టేకోవర్ చేసి సంస్థ అభివృద్ధికి, రాయితీలకు ఏటా బడ్జెట్లో 3% కేటాయింపు
* యాజమాన్యం వాడుకున్న CCS, SRBS, PF నిధుల్ని వెంటనే విడుదల చేస్తూ CCSలో ఎన్నికల నిర్వహణ
* ప్రతి కార్మికునికి 21 రోజుల హాజరుతోపాటు ఇన్సెంటివ్
* మహాలక్ష్మీ స్కీంలో జీరో టికెట్ కు బదులు మహిళలకు స్మార్ట్ కార్డులు
* విద్యుత్తు బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం
* అద్దె బస్సు డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం, ESI ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు