మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు రుణాల ద్వారా బస్సుల్ని కొనుగోలు చేయించి వాటిని RTCకి అద్దెకు ఇప్పిస్తోంది. ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ననగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 17 కొత్త జిల్లాల్లో కార్యాచరణ(Action Plan) అమలుకు ఉత్తర్వులిచ్చింది. 150 మండల మహిళా సమాఖ్యల ద్వారా తొలి దశలో 150 బస్సుల్ని కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. రెండో దశలో మరో 450 బస్సులు తీసుకోనున్నారు. ఒక్కో బస్సుకు రూ.36 లక్షలు కానుండగా, నెలవారీగా రూ.77,220 చొప్పున సమాఖ్యలకు అందుతాయి. RTC అద్దె బస్సుల నిర్వహణ(Management) కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.