ప్రధాన ఆలయాల్లో(Temples) భక్తుల రద్దీ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్ని కలుపుతూ ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు కాబోతున్నది. దక్షిణ కాశీగా పేరున్న శైవ క్షేత్రం వేములవాడ, లక్ష్మీనరసింహస్వామి కొలువైన ధర్మపురి, ఆంజనేయస్వామి ఆలయం కొండగట్టును కలుపుతూ ఇంటర్ లింకింగ్ ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రకటించారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం(Study) చేసిన తర్వాత ఎలా అనుసంధానించాలనేది నిర్ణయిస్తామన్నారు.