
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 84 ట్రాఫిక్ సూపర్ వైజర్స్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈనెల(డిసెంబరు) 30 నుంచి 2026 జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.tgprb.in వెబ్సైట్ సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్ని రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) నిర్వహిస్తోంది. అర్హత, నిబంధనల్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అప్లై చేసుకోవాలని బోర్డు తెలిపింది. ట్రాఫిక్ సూపర్ వైజర్స్ ట్రైనీ పే స్కేర్ రూ.27,080-81,400, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పే స్కేల్ రూ.27,080-81,400 ఉంటుందని ప్రకటించింది. ఈ రెండింటి ఫీజు SC, ST, లోకల్ టూ TG అభ్యర్థులకు రూ.400, మిగతా అందరికీ రూ.800 ఉంటుంది.