
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 1743 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులున్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు ఆన్లైన్ లో అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు పోలీసు నియామక మండలి వెబ్సైట్ tgprb.in ను సంప్రదించాలని MD సజ్జనార్ తెలిపారు.