ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో ఫిర్యాదులు(Complaints) వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు సీ విజిల్ యాప్ ద్వారా 3,205 కంప్లయింట్స్ వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(Chief Electoral Officer) వికాస్ రాజ్ తెలిపారు. అందులో 1,961 ఫిర్యాదులు సరైనవిగా గుర్తించి RO(రిటర్నింగ్ ఆఫీసర్)లు చర్యలు తీసుకున్నారన్నారు. మేనిఫెస్టో(Manifesto)లను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందజేయాలని, అందులోని స్కీములు ఎన్నికల నియమావళికి లోబడి ఉన్నట్లు సర్టిఫై చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అడ్వర్టయిజ్‌మెంట్స్ కోసం పార్టీలు, అభ్యర్థులు ముందుగా అనుమతి తీసుకోవాలని, రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అలా ఇప్పటివరకు 36 పర్మిషన్స్ ఇచ్చినట్లు వికాస్ రాజ్ తెలియజేశారు. ఈ నెల 10వ తేదీ తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేస్తామని, 15లోపు ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు.