భారీ వర్షాలు వాటి వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి మూడు హెలికాప్టర్లు(Helicopters) సిద్ధంగా ఉంచామని రక్షణ శాఖ ప్రకటించింది. అయితే ఎడతెరిపిలేని వర్షాలతో వాటి రాకకు ఆటంకం ఏర్పడింది. పలు చోట్ల జనం జలదిగ్బంధంలో చిక్కుకోగా, వారిని కాపాడేందుకు వాయుమార్గం మినహా మరో దారి లేదు. అయితే హెలికాప్టర్ల రావడంలో ఆలస్యంపై రక్షణ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఫోన్ చేశారు. వర్షాల వల్లే సకాలంలో రావట్లేదని, వాటిని రప్పించే పనిలో ఉన్నామని అధికారులు బదులిచ్చారు. నాందేడ్, బీదర్ నుంచి ఛాపర్లు రప్పిస్తున్నారు. 3 ఛాపర్లు వస్తున్నట్లు ఎయిర్ కమాండెంట్ వి.ఎస్.సైనీ, గ్రూప్ కెప్టెన్ ఛటోపాధ్యాయ సమాచారమిచ్చినట్లు సంజయ్ ప్రకటించారు.