BC రిజర్వేషన్ల అమలుకు 3 ప్రత్యామ్నాయాలున్నాయన్నారు CM రేవంత్. 50% సీలింగ్ పై గత ప్రభుత్వ చట్టాన్ని కాదని జీవో ఇవ్వొచ్చని, అయితే ఎవరైనా కోర్టుకు వెళ్తే కష్టమవుతుందన్నారు. ఇలా మొదటి ఆలోచన సాధ్యం కాదన్నారు. ఇప్పుడే ఎన్నికలకు వెళ్లకపోవడం రెండో దారి అని, అలా చేస్తే కేంద్ర నిధులు ఆగి గ్రామాలు ఆగమవుతాయన్నారు. పార్టీపరంగా 42% ఇచ్చి ఇతర పార్టీలపైనా ఒత్తిడి తేవాలన్నది మూడో వ్యూహమన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం సాయంత్రం వరకు వేచిచూస్తామని, అలా జరగకపోతే ద్రౌపది ముర్ముపై ఒత్తిడి ఉన్నట్లేనని రేవంత్ అన్నారు. సెప్టెంబరు 30 లోపు ఎలక్షన్లు జరగాల్సిందేనని హైకోర్టు(High Court) ఇప్పటికే స్పష్టం చేసింది.