రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం జోరుగా వానలు పడ్డాయి. దీంతో చాలా చోట్ల 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో 9.7 సెం.మీ. కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే…
టాప్-10 లిస్టు ఇలా… (సెంటీమీటర్లలో)
నారాయణపూర్(యాదాద్రి భువనగిరి) – 9.7
హిమాయత్ నగర్(హైదరాబాద్) – 9.0
సరూర్ నగర్(రంగారెడ్డి) – 8.9
నాంపల్లి(హైదరాబాద్) – 8.8
ముషీరాబాద్(హైదరాబాద్) – 8.7
చార్మినార్(హైదరాబాద్) – 8.7
అంబర్ పేట్(హైదరాబాద్) – 8.5
తుర్కపల్లి(యాదాద్రి భువనగిరి) – 8.2
యాకుత్ పుర(హైదరాబాద్) – 8.1
బండ్లగూడ(హైదరాబాద్) – 8.0