తగ్గిన టోల్ ఛార్జీలు(Fees) మార్చి 31 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇది 2026 మార్చి 31 వరకు ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజాలున్నాయి. కార్లు, జీపులు, వ్యాన్ ల ఒకవైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా రూ.30 తగ్గగా.. ఇకనుంచి అది రూ.80, రూ.115 కానుంది. తేలికపాటి వాణిజ్య వాహనాలకు రూ.25, రూ.40 మేర తగ్గుతుండగా.. వరుసగా రూ.125, రూ.190 అవుతుంది. బస్సు, ట్రక్కులకు రూ.50, రూ.75 లెక్కన.. ఇక రూ.265, రూ.395 చెల్లించాలి. 24 గంటల్లోపు రిటర్న్ జర్నీకి 25% మినహాయింపు ఉంటుంది. ఈ హైవేపై 2012లో GMR టోల్ మొదలవగా.. 2024 జూన్ 31కి ఒప్పందం ముగిసింది. జులై 1 నుంచి ఆ బాధ్యతల్ని NHAI చూస్తోంది. GMRకు ఏటా ఛార్జీలు పెంచుకునే ఛాన్స్ ఉండగా.. ఇప్పుడు NHAI చేతిలోకి రావడంతో ఛార్జీలు దిగివచ్చాయి.