రేపు(శుక్రవారం) కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండటంతో ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చింది. మొత్తం 8 జిల్లాలు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో హెవీ రెయిన్స్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇక ఇప్పటికే వరద నీరు పోటెత్తుతున్న జిల్లాలకు రేపు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కంటిన్యూ అవుతాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని IMD ప్రకటించింది.