గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను.. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) నాయకులు కలిశారు. ఈమధ్యే శాసనమండలి సభ్యుడి(MLC)గా ఎన్నికైన మల్క కొమురయ్యతో కలిసి గవర్నర్ తో భేటీ అయ్యారు. ఉపాధ్యాయులకు రావాల్సిన 5 డీఏలను వెంటనే ఇచ్చేలా చూడాలని కోరారు. PRC కమిటీ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడంతోపాటు పెండింగ్ బిల్లుల పరిష్కారంపై దృష్టిసారించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, జనరల్ సెక్రటరీ నవాత్ సురేశ్.. గవర్నర్ ను కలిసినవారిలో ఉన్నారు.