రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పొద్దున 11:30కు ట్రాఫిక్ జాం కావడంతో వేరే రూట్లలో వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. మలక్ పేట, యశోద హాస్పిటల్, మలక్ పేట రైల్వే స్టేషన్, నల్గొండ X రోడ్, అజంపుర, చాదర్ ఘాట్ రోటరీ వైపు పెద్దసంఖ్యలో వెహికిల్స్ నిలిచిపోయాయి. వందలాదిగా వచ్చిన వాహనాలతో రోడ్లన్నీ బిజీబిజీగా మారాయి. విజయవాడ వైపు నుంచి MGBSకు వచ్చే దారిలోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో దిల్ సుఖ్ నగర్-పాతబస్తీ ప్రాంతాలకు రవాణా స్తంభించిపోయింది.
అసలే హైదరాబాద్ లోని మలక్ పేట ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీనికితోడు వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచి మరింత స్లో గా వెళ్లాల్సి వస్తున్నది. ఆఫీసుల టైమ్ కాబట్టి పెద్దసంఖ్యలో వెహికిల్స్ రోడ్లపైకి రావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతున్నదని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. మలక్ పేట్ ఏరియాలోని తాజా పరిస్థితులపై ట్రాఫిక్ పోలీసులు మ్యాప్ విడుదల చేశారు.