హైకోర్టులో విషాదకర ఘటన ఏర్పడింది. సీనియర్ న్యాయవాది(Lawyer) కూర్చున్నచోటే అలాగే పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. మాజీ స్పెషల్ GP పర్సా అనంత నాగేశ్వరరావు(Nageswararao).. స్టాఫ్, క్లయింట్స్ చూస్తుండగానే పక్కకు ఒరిగిపోయారు. ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. అక్కడున్న సిబ్బంది తక్షణమే స్పందించినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో నాగేశ్వరరావు మరణించగా, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు తోటి న్యాయవాదులు.