ఉద్యోగుల సాధారణ బదిలీల(Transfers) గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు.
ముందుగా ప్రకటించిన మేరకు ఈనెల 5 నుంచి మొదలైన బదిలీల ప్రక్రియ నేటి(జులై 20)తో ముగియాల్సి ఉంది. జీవో 3కు సంబంధించి బదిలీల ప్రక్రియ కొన్ని శాఖల్లో కొలిక్కి(Final) రాకపోవడం, ట్రాన్స్ ఫర్లలో నెలకొన్న గందరగోళం నడుమ గడువు పొడిగిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.