ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కు అనుగుణంగా కాకుండా టీచర్ల బదిలీ(Transfers)ల్లో కొద్దిగా మార్పులు జరుగుతున్నాయి. ప్రధానోపాధ్యాయుల(Head Masters) ట్రాన్స్ ఫర్స్ ఈనెల 15న కాకుండా రెండు, మూడు రోజులు లేట్ కానున్నాయి. ప్రస్తుతం సెక్టోరియల్ ఆఫీసర్స్ గా ఎన్నికల డ్యూటీల్లో ఉన్నందున తమ బదిలీలు ఆపాలని కొందరు HMలు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు కటాఫ్ తేదీని మార్చడంపైనా పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. జనవరి 25న ఇచ్చిన GO 5లో ట్రాన్స్ఫర్స్ కటాఫ్ డేట్ ను ఫిబ్రవరి 1గా చెబితే.. ఇప్పుడు దాన్ని సెప్టెంబరు 1కి మార్చడం వల్ల తాము నష్టపోతున్నామని తెలియజేశారు. గతంలో ఇచ్చిన GOలో సవరణలు చేయకుండా కటాఫ్ తేదీని ఎలా మారుస్తారంటూ కోర్టుకు విన్నవించడంతో ప్రభుత్వం స్పందించింది.
జీవో 5కి సవరణ చేసి మళ్లీ ఆర్డర్స్ ఇస్తామని కోర్టుకు సర్కారు తెలిపింది. ఈ నెల 14న మరోసారి విచారణ ఉండటంతో దీనిపై వెంటనే సవరణ ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. నిజానికి ఈ నెల 12, 13 తేదీల్లో బదిలీలకు HMలు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉండగా.. కేసు కారణంగా ఆన్ లైన్ లో ఆప్షన్లకు అవకాశం ఇవ్వలేదు. GOలో సవరణ దృష్ట్యా ఈ బదిలీలు మరింత ఆలస్యం కాబోతున్నాయి.