ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీలో ముందడుగు పడింది. ఈ ఫైల్ ను ఆర్థిక శాఖకు పంపడంతో నిరుద్యోగుల్లో ఆశలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాల నోటిఫికేషన్లతో సందడి నెలకొనగా ఇప్పుడు ఖాళీల ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపిన ఫైల్ తో టీచర్ల రిక్రూట్ మెంట్ ఎప్పుడుంటుందా అన్న ఆశ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. మొత్తం 5,200కు పైగా పోస్టులుండగా.. అందులో 2,600 SGT, 1,700 స్కూల్ అసిస్టెంట్లు, 600 లాంగ్వేజ్ పండిట్స్, 160 PETలు ఉన్నాయి.
ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ వెల్లడి కాగా.. 4 లక్షల మందికిపైగా అప్లై చేసుకున్నారు. పాత అభ్యర్థులు కలిపితే ఈ సారి నిర్వహించే TRTకి భారీగా కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 5,200 పోస్టులకు సంబంధించిన ఫైల్ ను ఆర్థిక శాఖకు పంపడంతో అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందన్న ఆశయితే కనపడుతున్నది.