

TSPSC సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో నియమితులైన ఆరుగురు సభ్యుల అర్హతలను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లింగారెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, ధన్ సింగ్, సుమిత్ర, చంద్రశేఖర్ నియామకాలను పరిశీలించాలని సూచించింది. ఈ ఆరుగురిని నియమిస్తూ 2021 మే 19న… జీవో 108 జారీ అయింది. TSPSC సభ్యుల అ ర్హతలు నిబంధనల మేరకు లేవని, వాటిని ఉల్లంఘించారంటూ కాకతీయ వర్సిటీ రిటైర్డ్ ప్రొ.వినాయక్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. నియామకాల విషయంలో అర్హతలను మరోసారి పరిశీలించాలని తీర్పునిచ్చింది. 3 నెలల్లో అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ ఆరుగురి నియామకాల్ని రద్దు చేయాలని పిటిషనర్ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ఆ ప్రశ్న ప్రస్తుతం అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఆరుగురు సభ్యుల నియామకం ప్రభుత్వ తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని తీర్పు వెలువరించింది.