ఉద్యోగ నోటిఫికేషన్లలో భాగంగా గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాల్ని(Exam Results) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పోస్టుల భర్తీ కోసం గతంలో ఆరు నోటిఫికేషన్లు ఇచ్చారు. మొత్తం 547 ఉద్యోగాల కోసం 2022లో నోటిఫికేషన్లు ఇస్తే.. 2023 మే, జూన్, జులై నెలల్లో వాటికి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు.
ఇప్పుడీ ఎగ్జామ్స్ కు సంబంధించి జనరల్ ర్యాంక్ మెరిట్ లిస్టును(GRL)ను TSPSC ప్రకటించింది. ఈ జాబితాను తమ వెబ్ సైట్ లో ఉంచినట్లు TSPSC కార్యదర్శి ప్రకటనలో తెలియజేశారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన(Certification) కోసం 1:2 నిష్పత్తిలో లిస్టులు ప్రకటిస్తామని తెలిపారు.
పోస్టు | ఉద్యోగాల సంఖ్య | పరీక్ష జరిగిన తేదీ |
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్ | 175 | 2023 జులై 8 |
వ్యవసాయ అధికారి(AO) | 148 | 2023 మే 16 |
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ | 113 | 2023 జూన్ 28 |
లైబ్రేరియన్లు | 71 | 2023 మే 17 |
హార్టికల్చర్ ఆఫీసర్ | 22 | 2023 జూన్ 17 |
డ్రగ్ ఇన్స్ పెక్టర్ | 18 | 2023 మే 19 |