
ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రద్దయి ఇప్పుడు ఏకంగా నోటిఫికేషనే(Notification) క్యాన్సిల్ అయిన గ్రూప్-1 పరీక్షలో ఎయే సామాజికవర్గాలకు ఎన్ని పోస్టులుంటాయి.. ఈ పరీక్ష విధానం ఎలా ఉంటుంది.. మొత్తం కేటగిరీల వారీగా పోస్టులెన్ని… అన్నవి ఇప్పుడు చూద్దాం. మే లేదా జూన్ లో జరిగే ప్రిలిమ్స్, సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహించే మెయిన్స్ పరీక్షలు ఎలా ఉంటాయన్న దానిపైనా TSPSC క్లారిటీ ఇచ్చింది. మెయిన్స్ ఎగ్జామ్స్ మాత్రం హైదరాబాద్(HMDA) పరిధిలోని సెంటర్లలో మాత్రమే జరుగుతాయి. ఈ మెయిన్స్ మొత్తం డిస్క్రిప్టివ్ పద్ధతిలోనే ఉండనుంది.
| పేపర్ విధానం | మార్కులు | సమయం |
| జనరల్ ఇంగ్లిష్ | 150 మార్కులు | 3 గంటలు |
| పేపర్-1: సమకాలీన అంశాలపై సాధారణ వ్యాసం(Essay) | 150 మార్కులు | 3 గంటలు |
| పేపర్-2: చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం | 150 మార్కులు | 3 గంటలు |
| పేపర్-3: భారతీయ సమాజం, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషనన్ | 150 మార్కులు | 3 గంటలు |
| పేపర్-4: ఆర్థిక శాస్త్రం, అభివృద్ధి | 150 మార్కులు | 3 గంటలు |
| పేపర్-5: సైన్స్, టెక్నాలజీ | 150 మార్కులు | 3 గంటలు |
| పేపర్-6: తెలంగాణ ఆలోచన(1948-1970), సమీకరణ దశ(1971-1990), తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వైపు(1991-2014) | 150 మార్కులు | 3 గంటలు |
కేటగిరీల వారీగా చూస్తే ఓసీ కింద 209 పోస్టులను కేటాయించారు.
| కేటగిరీ | పోస్టుల సంఖ్య |
| ఓసీ | 209 |
| ఈడబ్ల్యూఎస్ | 49 |
| బీసీ(ఏ) | 44 |
| బీసీ(బీ) | 37 |
| బీసీ(సీ) | 13 |
| బీసీ(డీ) | 22 |
| బీసీ(ఈ) | 16 |
| ఎస్సీ | 93 |
| ఎస్టీ | 52 |
| దివ్యాంగులు | 24 |
| క్రీడాకారులు | 4 |