Published 20 Jan 2024
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. నిత్యం బస్సుల్లో తిరుగుతూ ఎప్పుడు ఏమవుతుందోనన్న భయంతో కాలం గడుపుతున్న డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ఉద్యోగులందరికీ తీపికబురును సంస్థ అందించింది. ప్రమాదం సంభవించి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే ఇప్పటివరకు రూ.40 లక్షల వరకు బీమా అందేది. ఇప్పుడా బీమాను కోటి రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది RTC. ప్రమాద బీమా పెంపుపై RTC MD వి.సి.సజ్జనార్, UBI(Union Bank OF India) సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందినా, శాశ్వత వికలాంగులుగా మారినా సిబ్బందికి ఈ ప్రమాద బీమా అందుతుంది.
Also Read: ఆర్టీసీ ‘దసరా ధమాకా’… జర్నీకి బహుమతులు
రూపే కార్డు ద్వారా మరికొంత…
UBI సూపర్ శాలరీ సేవింగ్స్ అకౌంట్(USSA) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మరోవైపు రూపే కార్డు ద్వారా ఇంకో రూ.12 లక్షల బీమా సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎలాంటి ప్రీమియం చెల్లించే అవసరం లేకుండానే రూ.1.12 కోట్ల ప్రమాద బీమాను UBI సహకారంతో బాధితులకు అందించే ఏర్పాట్లు చేపట్టింది. ఈ సరికొత్త బీమా విధానం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
మరిన్ని చదవండి: