రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది. దీంతో గురు, శుక్రవారాల్లో విద్యాసంస్థలు మూసి ఉండనున్నాయి. ఎడతెరిపిలేని వానలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
Really good update news coverage sir,..
Keep it up sir..
Iam following regularly ….