రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజులు సెలవులు ప్రకటించింది. బుధ, గురువారాల్లో స్కూళ్లు తెరవకూడదని ఆదేశాలిచ్చింది. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదం పొంచి ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో CM కేసీఆర్.. విద్యాసంస్థలన్నింటినీ రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు(Orders) విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు.