తల్లిదండ్రులు, అత్తమామల్ని కలుసుకుని వారితో సరదాగా గడిపేందుకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం రెండు రోజుల పాటు సెలవులు కేటాయిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. వారితో సమయం గడపడానికి నవంబరులో రెండు రోజుల ప్రత్యేక(Special) క్యాజువల్(Casual) ఇవ్వనున్నట్లు అక్కడి CMO(చీఫ్ మినిస్టర్ ఆఫీస్) ప్రకటించింది.
ఉన్నోళ్లకే మరి…
అయితే తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నవారికే ఈ నిబంధన వర్తిస్తుందని అస్సాం(Assam) సర్కారు తెలిపింది. పెద్దలు లేనివారికి ఈ సెలవులు వర్తించవని, వ్యక్తిగత సరదాలకు వాటిని ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
పెద్దలను గౌరవించడం, వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే ఈ సెలవులు ఇస్తున్నారు. నవంబరు 6, 8 తేదీల్లో ఈ సెలవులు ఇవ్వనుండగా.. 7న ఛత్ పూజ, 9 నాడు రెండో శనివారం, 10 నాడు ఆదివారం రావడంతో వరుసగా ఐదు రోజుల పాటు తీరిక దొరకనుంది.