
చినుకు.. రాష్ట్రాన్ని కునుకు పట్టనివ్వడం లేదు. వారం రోజులుగా పెద్దయెత్తున కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఇకనైనా వర్షాలు తగ్గుతాయేమో అనుకుంటే అదీ లేకుండా పోయింది. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ రోజు కొన్ని జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేయగా.. రేపు కూడా ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. ఇవాళ 10 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ఇష్యూ అయింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు(Heavy Rains) ఉంటాయని స్పష్టం చేసింది.
రేపు సైతం 8 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
రేపు కూడా భారీ వర్షాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ 16 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.