సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. పార్టీ మీటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన BJP ప్రెసిడెంట్ JP నడ్డా… అమ్మవారి సేవలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించుకున్నారు. MLC కవిత మహాకాళి దేవికి బంగారు బోనం సమర్పించారు. CLP లీడర్ భట్టి విక్రమార్క దంపతులు, MLA ఈటల రాజేందర్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ ఆలయంలో దర్శనం చేసుకున్నారు.
ఉజ్జయిని మహాకాళి బోనాలతో ఆదివారం సికింద్రాబాద్ లోని ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది ఎదురుచూశారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రులు హాజరై అమ్మవారికి పూజలు చేశారు.