సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి బోనాలు సమర్పించే క్రతువు ఘనంగా మొదలైంది. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్… కుటుంబ సభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. ఉజ్జయిని మహాకాళి తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు టెంపుల్ కు చేరుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సికింద్రాబాద్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. మరోవైపు ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అమ్మవారి ఘటాన్ని ఊరేగించగా… పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.