అవినీతిపరులను వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి చెప్పిన మరుసటి రోజే కేంద్ర మంత్రి కీలక కామెంట్స్ చేశారు. మోదీ మాటలను బలపరుస్తూ లిక్కర్ స్కామ్ లో మరింత దూకుడు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే.. కవిత విషయంలో మరింత గడ్డుకాలం ముందుందని అన్నారు. కేసీఆర్ కుమార్తె, MLC కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఇవాళో, రేపో ఆమెకు శిక్ష పడటం ఖాయమని, కవితను ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు.
భాగ్యనగర్ కాస్తా షరాబ్ నగర్
కేసీఆర్ కుటుంబంపై చౌబే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘ప్రజలను KCR తాగుబోతులుగా చేశారు.. భాగ్యనగర్ ను షరాబ్ నగర్ గా మార్చారు.. ధరణి పోర్టల్ కాదది దోచుకునే పోర్టల్.. BJP అధికారంలోకి వస్తే ధరణిని క్యాన్సిల్ చేస్తాం.. KCR ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది.. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో కలిసి లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నారు.. కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరూ కలిసి ప్రజలను దోచుకుంటున్నారు.. అని అశ్వినీ కుమార్ చౌబే విమర్శలు చేశారు.