విద్యార్థి సంఘాల(Student Unions)ను కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ విద్యాశాఖ కీలక సూచనలు చేసినట్లు కనపడుతోంది. తరచూ బడులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న కోణంలో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇకనుంచి యూనియన్ లీడర్లను స్కూళ్లలోకి అనుమతిస్తే HMలే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల DEOలకు ఆర్డర్స్ ఇష్యూ అయినట్లు తెలిసింది. ఏ బడికైనా యూనియన్ నాయకుడు వచ్చినట్లు తెలిస్తే ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. సదరు HMపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.. అని ఆదేశాల్లో హెచ్చరించినట్లు సమాచారం.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో స్కూళ్లను వివాదాల్లోకి లాగకుండా చూడాలన్న కోణంలోనే ఈ ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. PS, UPS, హైస్కూల్స్, మోడల్ స్కూళ్లు, KGBVలకు ఇది వర్తించనుంది. వ్యక్తులు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యూనియన్లు ఎవరైనా సరే స్కూళ్లల్లోకి వెళ్లాలంటే ముందుగా DEO పర్మిషన్ ఉండాలి. దీనిపై స్టూడెంట్స్ యూనియన్లు మండి పడుతున్నాయి. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తే అడ్డుకోవడం అప్రజాస్వామికమని అంటున్నాయి. అయితే దీనిపై HMలు కూడా ఆవేదనతో ఉన్నారు. యూనియన్ లీడర్లు రావడం, రాకపోవడమన్నది తమ చేతిలో లేదని, వారిని ఆపడం కూడా కష్టమని ఉన్నతాధికారులకు చెబుతున్నారు.
Super…news