విశ్వవిద్యాలయాల(Universities)పై నమ్మకం కలిగేలా పనిచేయాలని, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేయాలని వైస్ ఛాన్సలర్లకు CM రేవంత్ సూచించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేపట్టాలని, అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉపకులపతులంతా(Vice Chancellors) ముఖ్యమంత్రిని కలిశారు. వైస్ ఛాన్సలర్ల రిక్రూట్మెంట్ ను పైరవీలకు అతీతంగా చేపట్టామన్న CM.. తప్పు జరిగితే ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. యూనివర్సిటీల్లో గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై దృష్టిపెట్టాలని, విద్యార్థులకు అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలని CM స్పష్టం చేశారు.