కొత్తగా 13 పట్టణాభివృద్ధి(Urban Development) సంస్థల(Authorities)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు తోడు కొత్తవాటిని ఏర్పాటు చేయబోతున్నది. వనపర్తి, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, కామారెడ్డి, కాగజ్ నగర్, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రోడ్లు, తాగునీరు, ఉపాధి అవకాశాలు, శాటిలైట్ టౌన్ షిప్ లు సహా వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను UDA పరిధిలోకి తీసుకువచ్చారు. మరోవైపు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిని విస్తరించారు. UDAల పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు, గ్రామాలను తాజా ఉత్తర్వుల్లో నోటిఫై చేశారు.