
జూబ్లీహిల్స్(Jubilee Hills) ను రాష్ట్రంలోనే అత్యంత రిచెస్ట్ గా భావిస్తారు. కానీ ఓట్లకు కరవు. ప్రస్తుతం పోలింగ్ ప్రారంభం కాగా, 4 లక్షల మంది ఓటర్లున్నారు. ఒక్కసారి మాత్రమే 50 శాతానికి చేరువైంది. 2014లో 50.18%, 2019లో 45.59%, 2023లో 47.58% పోలింగ్ నమోదైంది. లోక్ సభకైతే 2019లో దారుణంగా 39.89% మందే ఓటేశారు. సెలబ్రిటీలు, ప్రముఖులు ఉండే ప్రాంతమైనా ఓట్లు పడట్లేదు. బాగా డబ్బుంటేనో, చదువుకుంటేనో ఓట్లు పడతాయనుకోవడం భ్రమేనని దీన్నిబట్టి అర్థమవుతుంది. ఓటింగ్ విషయంలో కఠిన నిబంధనల్ని తీసుకొస్తేగానీ దేశంలో మార్పు కనిపించదేమో.