లోక్ సభ ఎన్నికల్లో(Loksabha Elections) ఓటు వేసేందుకు ఓటర్లు నిదానంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దీంతో తొలి నాలుగు గంటల్లో పావు శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 24.31 శాతం పోలింగ్ రికార్డయినట్లు ఎన్నికల సంఘం(Election Commission) తెలిపింది.
అటు రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, ఉన్నతాధికారులు పొద్దున్నే తమ ఓటును వేశారు. సినీ నటులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని పోలింగ్ సెంటర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొద్దున తొమ్మిది గంటల వరకు 9.51% నమోదు కాగా… అందులో ఆదిలాబాద్ నియోజకవర్గం 13.22%తో టాప్ ప్లేస్ లో… నల్గొండ 12.80%తో రెండో స్థానంలో నిలిచింది.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం…
జహీరాబాద్ | 31.83 |
ఖమ్మం | 31.56 |
ఆదిలాబాద్ | 31.51 |
నల్గొండ | 31.21 |
మహబూబాబాద్ | 30.70 |
మెదక్ | 28.32 |
నిజామాబాద్ | 28.26 |
భువనగిరి | 27.97 |
నాగర్ కర్నూల్ | 27.74 |
మహబూబ్ నగర్ | 26.99 |
పెద్దపల్లి | 26.17 |
కరీంనగర్ | 26.14 |
వరంగల్ | 24.18 |
చేవెళ్ల | 20.35 |
సికింద్రాబాద్ | 15.77 |
మల్కాజిగిరి | 15.05 |
హైదరాబాద్ | 10.70 |