అవసరాన్ని బట్టి VRAలను వివిధ డిపార్ట్ మెంట్లలో అడ్జస్ట్ చేయాలని CM కేసీఆర్ ఆదేశించారు. VRAల క్వాలిఫికేషన్స్, సామర్థ్యాల మేరకు సర్దుబాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నీటిపారుదలతోపాటు ఇతర శాఖల్లో ఖాళీలను బట్టి కేటాయింపులు చేయాలని, అనంతరం వారి సర్వీసుని విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఇందుకోసం VRAలతో చర్చించి ఒపీనియన్స్ తీసుకోవాలని, వారి ద్వారా సేకరించిన అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ముగ్గురితో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సీఎం… కేటీఆర్ దాన్ని లీడ్ చేస్తారన్నారు.
కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంలో జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఉంటారు. VRAలతో రేపట్నుంచి మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు జరిపిన తర్వాత.. వారిచ్చే సూచనల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఫైనల్ రిపోర్ట్ అందిన తర్వాత మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదంతా వారం రోజుల్లోపు పూర్తి కావాలని కేసీఆర్ సూచించారు.
అటు పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం నిర్ణయించారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న JPSలను రెగ్యులరైజ్ చేయాలని.. ప్రొబెషన్ పూర్తయిన సెక్రటరీల పనితీరును అధికారులు రివ్యూ చేయాలన్నారు. మూడింట రెండొంతుల లక్ష్యాన్ని చేరుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని CM ఆదేశించారు.