
సెలవు(leave) పెట్టకుండా, అనుమతి(permission) లేకుండా రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వ టీచర్స్ దీర్ఘకాలికంగా సెలవులు పెడుతున్నారని.. అలాంటి వారిని జాగ్రత్తగా గమనించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. రెగ్యులర్ గా అటెండ్ కాని టీచర్స్ పై ఓ కన్నేసి ఉంచాలని స్పష్టం చేశారు. స్కూళ్లకు అటెండ్ కాని వారిని క్షుణ్నంగా పరిశీలించాలంటూ ఆమె.. DEOలు, RJDలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల హాజరుపై జిల్లా, మండల, ప్రాంతీయ స్థాయిల్లో రిజిస్టర్లు మెయింటెయిన్ చేయాలన్నారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అటెండెన్స్ వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్నారు.
ప్రతి నెల 5వ తేదీలోపు అటెండెన్స్ వివరాల్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోర్టల్ లో కచ్చితంగా అప్ లోడ్ చేయాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు వివరాలు సేకరించి DEOలు, RJDలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనధికారికంగా విధులకు గైర్హాజరయితే వెంటనే చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశించారు.
Super