రాష్ట్రవ్యాప్తంగా(Statewide) అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ జంటనగరాల్లో(Twin Cities) కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉద్యోగులంతా ఆఫీసుల నుంచి బయల్దేరే సమయంలో వాన పడటంతో జనమంతా ఎక్కడికక్కడే ఇరుక్కున్నారు. బంజారాహిల్స్, మాదాపూర్ తోపాటు మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి ఏర్పడింది.
కోఠి, మలక్ పేట, చాదర్ఘాట్ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. ఇక పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానకు చెట్లు విరిగిపడ్డాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్-9లో నాలాపై రోడ్డు కుంగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.