ఎక్సైజ్(Excise) శాఖకు ఆయుధాలు అప్పగించే అంశంలో నిబంధనలేంటి.. అడ్డంకులేంటి.. ఇతర రాష్ట్రాల్లో ఆయుధాలిచ్చారా.. అన్న అంశాలపై చర్చ జరిగింది. ఆ శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి ఈ విషయాల్ని అడిగారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా, NDPL కేసుల్లో శిక్షలు పడాలన్నారు. చర్లపల్లి ఫ్యాక్టరీలో మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ ముడిసరకు విలువ రూ.12 వేల కోట్లా అని ప్రశ్నించారు. ఆయుధాల విషయంపై ఇతర రాష్ట్రాల్లోని విధివిధానాల్ని అధ్యయనం చేయాలన్నారు. గోవాలో పెన్నీ, మధ్యప్రదేశ్ లో సారా(మహువా)ను బ్రాండింగ్ చేస్తున్నట్లు ఈత, తాటికల్లు కోసం టాడీ నేచురల్ బ్రూవరీ నెలకొల్పితే గీత కార్మికులకు ఆదాయం పెరుగుతుందన్న చర్చ సాగింది. https://justpostnews.com