Published 21 Dec 2023
రాష్ట్రంలో విద్యుత్తు రంగం పరిస్థితి దయనీయంగా మారిందని డిప్యుటీ CM, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. విద్యుత్తుపై శ్వేత పత్రం విడుదల చేసిన ఆయన.. వివిధ కేటాయింపులు, అప్పులు, సబ్సిడీలను వివరించారు. 2023 అక్టోబరు నాటికి రూ.81,516 కోట్ల అప్పులున్నట్లు శ్వేతపత్రంలోని వివరాల్ని శాసనసభ ద్వారా తెలిపారు. ఇక డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు కాగా.. ట్రాన్స్ కోకు సంబంధించి 2014 నాటికి రూ.2,911 కోట్లు ఉంటే అది 2023 నాటికి రూ.50,136 కోట్లకు చేరుకుందన్నారు.
వివిధ విభాగాల్లో నాటి-నేటి అప్పుల వివరాలివి…
రంగం | 2014 | మొత్తం అప్పులు |
ట్రాన్స్ కో | 2,911 కోట్లు | 50,136 కోట్లు |
జెన్ కో | 7,662 కోట్లు | 31,923 కోట్లు |
డిస్కంల లోన్లు | 10,763 కోట్లు | 39,457 కోట్లు |
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు | 150.28 కోట్లు | 14,193 కోట్లు |
పంచాయతీరాజ్ | 769.99 కోట్లు | 4,393.99 కోట్లు |
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ | 362.04 కోట్లు | 3,932.47 కోట్లు |
మిషన్ భగీరథ | 35.40 కోట్లు | 3558.83 కోట్లు |
మున్సిపాలిటీలు | 131.37 కోట్లు | 1657.81 కోట్లు |