పులి(Tiger) దాడిలో మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. కాగజ్ నగర్ మండలం గన్నారం సమీపంలో మోర్లె లక్ష్మీ అనే 21 సంవత్సరాల గ్రామస్థురాలిపై పులి దాడి చేసింది. బెంగాలి క్యాంప్-6 నంబరు సమీపంలో కూలీ పనికి వెళ్లిన సమయంలో దాడి జరగ్గా సహచరులు కేకలు వేయడంతో పులి పారిపోయింది. పత్తి ఏరడానికి మహిళలు గ్రామ శివారుకు వెళ్లారు. మహిళ మృతదేహంతో స్థానికులు కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ మధ్యకాలంలో జైనూరు, వాంకిడి మండలాల్లో పశువులపై పులి దాడులు జరిగాయి. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఫారెస్ట్ ఆఫీస్ వద్ద పెద్దయెత్తున ఆందోళనకు దిగారు.