యూరియా(Urea) క్యూలైన్లలో గొడవ జరిగి ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడి వందలాది మంది చూస్తుండగానే దాడి చేసుకున్నారు. మహబూబాబాద్(Mahabubabad) వివేకానంద సెంటర్ వద్ద గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఆధార్ కార్డు నమోదు విషయంలో గొడవ మొదలైంది. అక్కడున్నవారిలో కొందరు ఆ ఇద్దరు మహిళల్ని ఆపారు. ఉద్రిక్తత ఏర్పడటంతో రైతుల్లో కొంతమందికి యూరియా పంపిణీ చేసి నిర్వాహకులు వెళ్లిపోయారు.